Protest in Kuwait Against Chandrababu Arrest : చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని.. కువైట్‌లో సర్వమత ప్రార్థనలు - Protests in Kuwait against Chandrababu arrest
Published : Oct 7, 2023, 10:21 AM IST
|Updated : Oct 7, 2023, 4:01 PM IST
Protest in Kuwait Against Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును (Chandrababu Arrest) ఖండిస్తూ ఇప్పటికే దేశ, విదేశాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. తాజాగా కువైట్‌లోని ఫర్వానియ ప్రాంతంలో.. ఎన్ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. ఆయన త్వరగా కడిగిన ముత్యంలాగా విడుదల కావాలని సర్వమత ప్రార్థనలు చేశారు. ముందుగా ముస్లిం ఆచారం ప్రకారం నమాజు చేసి.. తర్వాత క్రిస్టియన్ ఆచారం ప్రకారం బైబిల్‌లోని కొన్ని వాక్యాలను చదివి.. చివరగా హిందూ ఆచారం ప్రకారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలతో స్తుతించారు
చంద్రబాబు త్వరగా విడుదల కావాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, అక్కిలి నాగేంద్ర బాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు, దుగ్గి శ్రీనివాస్, కొల్లి ఆంజనేయులు, మద్దిపట్ల శివ, నరేశ్. పెంచల్ నాయుడు, సుంకేసుల అన్వర్, గాజులపల్లి సుబ్బా రెడ్డి, శివారెడ్డి, మహాసేన రాజేశ్ రాపాక, సుబ్బరాజు, షేక్ రసూల్, ఖాదర్ వల్లి, గల్లా శ్రీనివాసులు, పూజుల శివ, జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.