తెలంగాణ

telangana

పోలీస్​ స్టేషన్ ముందు ఏనుగు, ఒంటెలు, గుర్రాలతో ఆందోళన

ETV Bharat / videos

పోలీస్​ స్టేషన్ ముందు ఏనుగు, ఒంటెలు, గుర్రాలతో ఆందోళన.. ఎందుకంటే? - బిహార్​లో ఏనుగు ఒంటెలు గుర్రాలతో నిరసన

By

Published : Jun 1, 2023, 10:43 AM IST

బిహార్ రాజధాని పట్నాలోని జక్కన్‌పుర్ పోలీస్​ స్టేషన్​ను ఏనుగు, ఒంటెలు, గుర్రాలతో ముట్టడించారు కొందరు వ్యక్తులు. ఓ హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇలా నిరసనకు దిగారు. ఘటన జరిగి రెండు నెలల కావొస్తున్నా.. నేరస్థులను పోలీసులు ఇంకా పట్టుకోకపోవడంపై.. మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ఏప్రిల్​ 7న మాజీ కౌన్సిలర్​ మున్నా రాయ్​పై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మున్నా.. అదే నెల 19న చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేరస్థులను ఇంకా పట్టుకోకపోడంపై మరోసారి పోలీస్​ స్టేషన్​ ఆశ్రయించారు మృతుడి కొడుకు మున్షి సుధాన్షు కుమార్, అతని కుటుంబ సభ్యులు. ఇదే సమయంలో పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన మున్నారాయ్​ బంధువులు ఏనుగు, ఒంటెలు, గుర్రాలతో పోలీస్​ స్టేషన్​ను ముట్టడించారు. ఘటనపై సమాచారం అందుకున్న సదర్ ఏఎస్పీ కామ్యా మిశ్ర.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్నవారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. "ఈ కేసుపై విచారణ జరుగుతోంది. సీసీటీవీలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నాం. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం" అని కామ్యా మిశ్ర తెలిపారు. వారం రోజుల్లోగా నేరస్థులను పట్టుకుంటామని హమీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details