తెలంగాణ

telangana

Professor Jayashankar Birth Anniversary

ETV Bharat / videos

Prof. Jayashankar Birth Anniversary at Telangana Bhavan : 'ప్రొఫెసర్ జయశంకర్​ బతికి ఉంటే.. తెలంగాణ అభివృద్ధిని చూసి గర్వపడేవారు'

By

Published : Aug 6, 2023, 12:06 PM IST

Minister KTR Pays Tribute To Professor Jayashankar : తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్​ జయశంకర్​ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకం అన్నారు. 1952 నుంచి మొదలైన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్న ఉద్యమం నుంచి ప్రారంభమైన ప్రొఫెసర్​ జయశంకర్ పోరాటం చాలా మందిలో స్ఫూర్తిని నింపింది అని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు జాడల్లో ఎప్పుడూ నడుస్తామని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికి ఏదైనా లోటుగా ఫీల్​ అవుతారు అంటే.. అది జయశంకర్​ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చూడకపోవడమే అని కేటీఆర్​ అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ఆయన బతికి ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడేవారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడటంలో ప్రొఫెసర్‌ పాత్ర మరవలేనిదంటూ మంత్రి గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details