కేసీఆర్ పాలనలో రెవెన్యూ శాఖ ఛిన్నాభిన్నం అయింది : ప్రొ.కోదండరాం
Published : Jan 4, 2024, 3:46 PM IST
Prof Kodandaram about Revenue :రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ పాలనలో ఛిన్నాభిన్నం చేశారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పని చేసే వీఆర్‌ఏ, వీఆర్వోలను రెవెన్యూ శాఖకు దూరం చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సరి చేసే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పని చేసిన వీఆర్‌ఏ, వీఆర్వోలకు గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని తెలిపారు.
Kodandaram Speech on Revenue Employees : కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి జీతాలు ఇవ్వడం ఒక సమస్యకు పరిష్కారం లభించిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు . రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని సైతం త్వరగా పరిష్కరించాలని కోదండరాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.