తెలంగాణ

telangana

Producers Met Pawan Kalyan

ETV Bharat / videos

Producers Met Pawan Kalyan: పవన్ సినిమాల్ని ఏపీలోనే చిత్రీకరిస్తాం.. స్పష్టం చేసిన దర్శక, నిర్మాతలు - పవన్​ను కలిసిన నిర్మాతలు

By

Published : Jun 13, 2023, 10:51 AM IST

Producers Met Pawan Kalyan: జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ను పలువురు దర్శక, నిర్మాతలు కలిశారు. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్​ యాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సంప్రదాయ వస్త్రాలు ధరించి పవన్ కల్యాణ్ యాగంలో పాల్గొన్నారు. గణపతి పూజతో.. యాగానికి అంకురార్పణ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలతో విలసిల్లాలని దేవతామూర్తులను పూజించారు. ఈ యాగంలో పలువురు ప్రొడ్యూసర్స్​ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌తో తాము నిర్మించే సినిమాల్ని రాష్ట్రంలోనే చిత్రీకరిస్తామని పలువురు నిర్మాతలు తెలిపారు. వారాహి యాత్రతో పాటు రాబోయే ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ రాష్ట్రంలోనే ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉండటంతో.. ఇక్కడే చిత్రీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన యాగ క్రతువుకు నిర్మాతలు వై.రవిశంకర్, డీవీవీ దానయ్య, ఏ.ఎం రత్నం, BVSNప్రసాద్, వివేక్ కూచిభొట్ల, దర్శకుడు హరీష్ శంకర్‌ హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details