సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్‌లో ఆ కుటుంబానికి సర్ప్రైజ్ - ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారం
Published : Nov 25, 2023, 8:34 AM IST
Priyanka Gandhi Surprises A Family in Husnabad : పక్కూరిలో ఉండే బంధువులో.. చాలాకాలం క్రితం దూరమైన స్నేహితులో ఊహించనిరీతిలో ఇంటికొస్తే ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఇంకొదరైతే ఉబ్బితబ్బవుతుంటారు. అలాంటింది కోట్లాది మంది అభిమానులుండి, క్షణం తీరికలేకుండా గడుపుతూ, రోజు టీవీలోనో, పేపర్లోనో కనిపించే ప్రముఖులు వస్తున్నారంటే వారిని చూసేందుకు పరుగులు తీస్తుంటారు. అంతటి వ్యక్తులే ఎవరూ ఊహించని విధంగా ఓ పేదింటిలో ప్రత్యక్షమైతే.. ఆ క్షణాలు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటాయి. అలాంటి ఘట్టమే హుస్నాబాద్‌లో శుక్రవారం రోజున ఆవిష్కృతమైంది.
Priyanka Gandhi Meets Common People in Telangana :5 రాష్ట్రాల్లో ఎన్నికలు, వరుస ప్రచారాలతో క్షణం తీరిక లేకుండా పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ.. అనుకోకుండా ఓ ఇంటికి వెళ్లారు. హుస్నాబాద్‌లో ప్రచారానికి వెళ్లిన ప్రియాంకా.. కిషన్‌నగర్‌లోని పేద దంపతులు రమాదేవి - రాజయ్యల ఇంటికి వెళ్లారు. రోజూ వార్తల్లో వచ్చే నాయకురాలు తమ ముందు ప్రత్యక్షం కావటంతో ఆ దంపతులు ఒక్కసారిగా పారవశ్యానికి గురయ్యారు. రమాదేవిని దగ్గరకు తీసుకున్న ప్రియాంక.. ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఇందిరా గాంధీని చూడాలనుకున్నా సాధ్యపడలేదని.. ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు మార్గంలో సభకు వచ్చి వెళ్తున్న ప్రియాంకా గాంధీ అటుగా వాహనాల్లో వెళ్తున్న వారితో వారితో కరచలనం చేస్తూ, సెల్ఫీలు దిగారు.