తెలంగాణ

telangana

principal teacher fight in bihar

ETV Bharat / videos

స్టూడెంట్స్​ ఎదుటే మహిళా టీచర్ల ఫైట్.. చెప్పులతో కొడుతూ, జుట్టు లాగుతూ.. - పట్నా వీడియో వైరల్

By

Published : May 26, 2023, 3:11 PM IST

Principal Teacher Fight In Bihar : బిహార్​.. పట్నాలో ఓ పాఠశాలలో ఇద్దరు టీచర్లు రెచ్చిపోయారు. విద్యార్థుల కళ్లముందే తన్నుకున్నారు. జుట్టు పట్టుకుని లాక్కొంటూ.. చెప్పులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  

అసలేం జరిగిందంటే..
పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్లో ఈ ఘటన గురువారం జరిగింది. కిటికీ తలుపులు మూయడంపై ప్రధానోపాధ్యాయురాలు, టీచర్ల మధ్య గొడవ మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌ను కోరారు. అందుకు ఆమె అంగీకరించకపోవడం వల్ల ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి తరగతి గది నుంచి బయటకు వస్తుండగా.. టీచర్‌ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్‌ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు టీచర్లు కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడం వల్ల గొడవను ఆపారు.  

ఈ ఘటనపై విద్యా శాఖ మండల అధికారి నరేశ్‌ స్పందించారు. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని నరేశ్​ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details