పంచ కట్టులో అర్చకుల క్రికెట్.. సంస్కృత భాషలో కామెంటరీ - Priests cricket tournament in Madhya Pradesh
సాధారణంగా క్రికెటర్లు షాట్లతో విరుచుకుపడుతుంటే.. కామెంటరీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ఇంగ్లీషు, హిందీ లేదా మరేదైనా ప్రాంతీయ భాషల్లో మనం క్రికెట్ కామెంటరీ వింటాం. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి కామెంటరీ సంస్కృతంలోనే సాగింది. మధ్యప్రదేశ్ భూపాల్‌లోని అన్కుర్ మైదానం.. ప్రత్యేక క్రికెట్ మ్యాచ్‌కు వేదికైంది. బరిలో దిగిన వారందరూ రోజూ గుడిలో పూజలు చేసే అర్చకులు కావడం విశేషం. అయితే వీరు క్రికెట్ ఆడటానికి ఓ కారణం ఉంది. సంస్కృతంపై ఉన్న మక్కువతో.. ఆ భాషను అందరికీ పరిచయం చేయాలనుకున్నారు. ఇందుకు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్‌ను సాధనంగా ఎంచుకున్నారు. తమదైన శైలిలో ధోతి కట్టి.. నుదిటిన తిలకం దిద్దుకుని బ్యాట్ పట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST