శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - డీమ్డ్ వర్సిటీ స్నాతకోత్సవానికి హజరు - AP Latest News
Published : Nov 22, 2023, 7:37 PM IST
|Updated : Nov 22, 2023, 10:26 PM IST
President Draupadi Murmu Visit to Puttaparthi:శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) పర్యటించారు. శ్రీ సత్య సాయి బాబా 98వ జయంతి వేడుకల్లో భాగంగా సత్య సాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి (Sri Sathya Sai Deemed University 42nd Convocation) ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని (Sathya Sai Maha Samadhi) రాష్ట్రపతి దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి వర్సిటీ 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.
రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, (AP Governor Abdul Nazir) శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ (Sri Sathya Sai Trust) చైర్మన్ రత్నాకర్ స్వాగతం పలికారు. వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు, డాక్టరేట్లు, పట్టాలు ద్రౌపది ముర్ము అందజేశారు.