Ambedkar Jayanti 2023 : ఓరుగల్లులో రాజ్యాంగ పీఠికను చూశారా..? - Constitution Preamble in warangal
Ambedkar Jayanti celebrations in Warangal: రాజ్యాంగ రచించిన వ్యక్తిగా పేరుపొందిన అంబేడ్కర్ అందరికీ ఆదర్శ ప్రాయడయ్యారు. ఊరూ, వాడా ఆయన విగ్రహాలు నెలకొల్పి ఆయనును స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నడిబొడ్జును 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలికొల్పి.. దళితులపై తమ ప్రేమను, అభిమానానాన్ని చాటుకుంటోంది.
వరంగల్లో అంబేడ్కర్ కూడలిలోనూ అంబేడ్కర్ మహనీయతను తెలిపై ఓ ఆవిష్కరణ ఉంది. అదేంటంటే.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ పీఠిక నమూనాను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పీఠిక స్థానికులను అలరిస్తోంది. వారాంతాలు, సెలువు దినాల్లో ఈ ప్రదేశంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం ధర్నాలతో దద్దరిల్లే ఈ ప్రాంతం.. సాయంత్రమవగానే సందర్శకులతో కిటికటలాడుతుంది. రాజ్యాంగం రచించిన మహనీయుడి గురించి రాబోయే తరాల వారికి తెలియజేసేందుకే ఆ పీఠిక ఏర్పాటు చేసినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. మరోవైపు వరంగల్ నగర కూడలిలో అంబేడ్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.