ఎన్నికల సంఘం పెద్దఎత్తున ఓటర్లను ఎందుకు తొలగిస్తోంది - ఓటర్ల తొలగింపుపై ప్రతిధ్వని చర్చ తాజా వార్తలు
Pratidwani దేశంలో ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితాల్లో లోటు పాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. జనాభా ఓటర్ల నిష్పత్తిని మించి అసాధారణ స్థాయిలో ఓటర్ల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాలు ఓటరు జాబితాల నుంచి లక్షల సంఖ్యలో పేర్లను తొలగించాయి. భారీ స్థాయిలో జరిగిన ఓటర్ల తొలగింపుపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎన్నికల సంఘం ఇంత పెద్దఎత్తున ఓటర్లను ఎందుకు తొలగిస్తోంది వీటిపై అభ్యంతరాలను స్వీకరించి, పరశీలించే ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉంటుందో లేదా ఉన్నపళంగా ఊడిపోతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితిపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST