Karnataka exit poll results : కన్నడ నాడి ఏం చెబుతోంది..? - కర్ణాటక ఎన్నికలు
Discussion on Karnataka exit poll results : దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానే వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వేల అంచనాలు వెలువడ్డాయి. అసలైన ఫలితాలు ఈ నెల 13న విడుదల కానున్నాయి. ఈ రోజు ఎన్నికల ఓటింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆశక్తిగా జరిగాయి. మరి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో గెలుపు ఎవరిది? కన్నడనాట గత కొన్ని దఫాలుగా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోన్న జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అవుతుందా? మొత్తం పోలింగ్ సరళిని ప్రభావితం చేసిన సమస్యలు ఏమిటి? ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఉత్కంఠగా మారిన అంశాలు ఇవే. ఈ నేపథ్యంలో కర్ణాటక ఓటరు నాడిపై సర్వే చేసిన అంచనాలు ఏం చెబుతున్నాయి? ఈ మొత్తం పరిణామాల ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.