ఎన్నికల ఫిర్యాదులు, ఈసీ ముందున్న సవాళ్లు - తెలంగాణలో ఎన్నికల నిబంధనలు
Published : Nov 3, 2023, 9:39 PM IST
Election Code Conditions in Telangana : ఎన్నికల ప్రచార సమయాల్లో నిబంధనల ఉల్లంఘనలు సాధారణంగా మారాయి కొంతకాలంగా. ప్రస్తుత అయిదు రాష్ట్రాల ఎన్నికలు, అందులోనూ తెలంగాణలో ఆ ఉల్లంఘనల శాతం మరింత పెరిగిందన్నది ఇప్పుడు కలవర పెడుతున్న విషయం. ఈసారి ఐదు రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసహనం వ్యక్తం చేస్తునట్లు సమాచారం.
ఓ వైపు ఈసీ కట్టదిట్టంగా చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. ఇన్ని ఉల్లంఘనలు ఎందుకు జరుగుతున్నట్లు.. లోపం ఎక్కడ ఉన్నట్లు? నిబంధనల ఉల్లంఘనలతో పాటు ఎన్నికల సన్నాహాలు, అలానే శాంతిభద్రతల విషయంలోనూ కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలు ఏమిటి.? తనిఖీల్లో పట్టుబడ్డ నగదు, మద్యం, ఇతరాలు లెక్కగట్టి నామినేషన్ల తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది ఈసీ? దీని ప్రభావం ఎలా ఉండొచ్చు..? ఈ నేపథ్యంలో ఈసీ కర్తవ్యం ఏంటనే అంశంపై నేటి ప్రతిధ్వని.