Prathidwani : పంట రుణాల మంజూరులో మారని బ్యాంకుల తీరు.. రైతన్నకు తప్పని అవస్థలు.. సమస్యకు చెక్ పెట్టేదెలా..? - telangana latest news
Published : Sep 11, 2023, 10:19 PM IST
Pratidwani Debate on Crop Loans in Telangana : రాష్ట్రంలో రైతులకు పంట రుణాల ( Crop Loans) మంజూరులో బ్యాంకుల తీరు మారడం లేదు. ఎన్నడూ లేనంతగా ఈ వానాకాలం సీజన్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న అన్నదాతలకు బ్యాంకులు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే సీజన్‌లో 3 నెలల సమయం గడిచినా.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో మూడో వంతు రుణాలనూ బ్యాంకులు రైతులకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పరిధిలోని రైతుల్లో అధిక శాతం మందికి మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. దీంతో పాటు ఇతరత్రా కారణాల పేరిట అన్నదాతలకు మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది.
ప్రతి ఏడాది ఇదే సమస్య తలెత్తుతోంది. బ్యాంకుల నుంచి సహాయం అందక.. రైతన్నలు ఎప్పటి మాదిరిగానే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలు ఈ సమస్య ఎందుకు ఏర్పడుతోంది..? ఈ సమస్యను పరిష్కరించడంలో బ్యాంకులకు ఉన్న ఇబ్బందులు ఏంటి..? రైతన్నలకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి..? ఈ విషయంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి చొరవ అవసరం..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..