pratidhwani దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న హైబీపీ, చక్కెర వ్యాధి..! - icmr about diabetes causes in India
pratidhwani: చక్కెర వ్యాధి చాపకింద నీరులా దేశం మొత్తాన్ని వణికిస్తోంది. పోటెత్తుతున్న హైబీపీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరోవైపు ఊబకాయం పెనుసవాళ్లు విసురుతోంది. మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐసీఎమ్ఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ భాగస్వామ్యంతో చేసిన అధ్యయనంలో వెల్లడైన భయపెట్టే నిజాలు ఇవి. ఈ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారిలో తెలుగురాష్ట్రాల వారేం మినహాయింపు కాదు. హైపర్‌టెన్షన్ విస్తృతి అయితే మరింత ఆందోళనకర స్థాయిలో ఉంది. దేశంలో ఏకంగా 35శాతం మంది వరకు దానిబారిన పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో మధుమేహం, హైబీపీ రెండింటి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసాలకు కారణం ఏమిటి? పల్లెలతో పోల్చితే పట్టణాల్లో ఆరోగ్యం ఎక్కడ గాడి తప్పుతోంది? ఈ గణాంకాలను బట్టి చూస్తే సమస్య మన ప్రజారోగ్యం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందనుకోవాలి? మరి ఈ గణాంకాలు దేనికి సంకేతం? దేశం ఈ బీపీ, షుగర్ల గండం దాటేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.