ఎన్నికల సవాళ్లకు పార్టీల వ్యూహాలేంటి?
Published : Nov 2, 2023, 10:01 PM IST
Prathidwani :రాష్ట్రంలో రాజకీయ రణరంగం మరో ఎత్తుకు చేరుకోనుంది. అత్యంత కీలకమైన నామినేషన్ల ప్రకియ కూడా మొదలుకానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నాయి. ఈ నామినేషన్ల పర్వం నవంబరు 10 వరకు జరగనుంది. నామినేషన్లలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని ప్రధాన పార్టీలు అభ్యర్థులకు సూచిస్తున్నాయి.
ఇప్పటికే పలు సవాళ్లతో తికమకపడుతున్న ప్రధాన పార్టీలు.. కొన్ని చోట్లలో అభ్యర్థులు కొలిక్కి రాకపోవడం సహా మరిన్ని సవాళ్లు ప్రధాన పార్టీల ముందున్నాయి. కచ్చితంగా అధికారం తమదే అంటున్న మూడు ప్రధాన పార్టీలు. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించనేలేదు. నామినేషన్ల వరకు చేరుకున్నప్పటికీ ఈ సవాళ్లు ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఆటంకాలుగా మారాయి. ఈ కీలకమైన ఘట్టంలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను అవి ఏ విధంగా శాసించగలవు? అసలు పార్టీల ముందున్న ప్రధాన సవాళ్లేంటి అనే అంశంపై నేటి ప్రతిధ్వని.