తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రధాన లక్ష్యం ఏంటి? - భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

By

Published : Jul 2, 2022, 11:03 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

Prathidwani: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు, ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు వచ్చారు. మరోవైపు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రమంత్రులు, తెరాస నేతలు భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. దీంతో హైదరాబాద్‌ నగరం భాజపా-తెరాస రాజకీయ బలప్రదర్శనకు వేదికయ్యింది. రాష్ట్రంలో అధికారం సాధిస్తామని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే కేంద్రంలో ప్రత్యామ్నాయం సృష్టిస్తామంటూ తెరాస ప్రతిజ్ఞ చేస్తోంది. ఇంతకాలం కేంద్రం-రాష్ట్రం మధ్య వివాదంగా సాగిన పోటీ ఇప్పడు భాజపా-తెరాస మధ్య రాజకీయ పోరుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉపందుకున్న రాజకీయ బల ప్రదర్శనలపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details