Prathidwani : ఈసారి తెలంగాణ రాజకీయాల్ని నిర్ణయించబోతున్న అంశాలు ఏమిటి?
Prathidwani on Telangana Assembly Elections : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు వేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఎన్నికలకు రానున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంల్లో అధికారులు బదిలీలు, పోస్టింగ్‌లపై ఇప్పటికే సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయ వాతావరణం కోలాహలంగా మారింది. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలు, సమీకరణాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఈ లెక్కలు ఎలా ఉండనున్నాయి? పార్టీల వారీగా ఎవరి బలాబలాలు, సవాళ్లు.. ఈసారి తెలంగాణ రాజకీయాల్ని నిర్ణయించబోతున్న అంశాలు ఏమిటి? వాటికి అనుగుణంగా రాజకీయపక్షాల సన్నద్ధత ఎలాఉంది? ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేతలను ఆకార్షించే పనిలో పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. పేరున్న నేతలు ఇప్పటికే వలసలు ప్రారంభించారు. దీంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి ఎంత వరకు సన్నద్ధమైంది అనే దానిపై నేటి ప్రతిధ్వని.