Prathidwani : హోరెత్తుతున్న ప్రచారం.. మరి ఈసీ నిబంధనల సంగతేంటి? - EC Rules in Telangana election today prathidwani
Published : Oct 27, 2023, 10:25 PM IST
Prathidwani :ఎన్నికల ఘట్టంలో అత్యంత కీలకమైంది ప్రచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రచార పర్వాన్ని అన్ని పార్టీలు పోటాపోటీగానే ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఆ క్రమంలో అభ్యర్థులు కొన్నిసార్లు పొరపాట్లు చేయడం, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు విలువ చేసే నగదు, బంగారం లాంటి వాటిని అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు.
ఎన్నికల్లో భద్రతా బలగాలు తీసుకోవాలసిన చర్యలు ఏంటి? మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఉండాలి? ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి వాస్తవిక పరిస్థితులు ఉన్నాయి? ఆంక్షలు అమల్లో ఉన్నా.. పలుచోట్ల కనిపిస్తున్న నిర్లక్ష్యం ఎందుకు? విద్వేషాలకు, వ్యక్తిగత దూషణలకు దూరంగా ప్రచారం. కుల, మత ప్రాతిపదికన ఓట్లు దండుకునే ప్రయత్నం శిక్షార్థం. ఫిర్యాదుల కోసం సీ విజిల్, 1950 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసిన ఈసీ.. దాని ముందున్న సవాళ్లేంటి? ఇదే అంశం పై నేటి ప్రతిధ్వని.