తెలంగాణ

telangana

Today Prathidwani Program

ETV Bharat / videos

Prathidwani : త్రిముఖపోరులో ప్రధాన పార్టీలు.. ప్రచార జోరులో ఏ పార్టీ ఎక్కడ? - టుడే ప్రతిధ్వని కార్యక్రమం

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 10:15 PM IST

Prathidwani discussion on Telangana Election :ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఒకర్ని మించి ఒకరు హామీలిస్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎంతమేరకు ఉండవచ్చు?  కాంగ్రెస్‌ కోసం, బీజేపీ కోసం దిల్లీ నుంచి అగ్రనాయకులు ప్రచారానికి తరలి వస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో సాగిపోతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది.

దేశంలో ఏ రాష్ట్రంలో అయినా వరుసగా మూడోసారి ఏపార్టీ అయినా అధికారంలోకి వచ్చిందా? అక్కడి పరిస్థితులు మనకి ఎంతవరకు అన్వయం అవుతాయి?తెలంగాణలో హంగ్ అసెంబ్లీ రావటానికి ఏవైనా అవకాశాలు ఉన్నాయా? ప్రధానంగా ఏఏ వర్గాల్లో ఎవరికి సానుకూలత కనిపిస్తోంది? ఇప్పుడిప్పుడే వస్తున్న సర్వేలు ఏం చెబుతున్నాయి? మరి.. ఇలా పోటాపోటీగా ముందుకెళ్తున్న పార్టీలకు సానుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details