Prathidwani : ముసురుతున్న వానలు.. పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. జాగ్రత్తలేంటి..?
Seasonal Diseases In Telangana : రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైనా పనుల మీద బయటకు వెళ్లే వారు.. ఎక్కడికక్కడ నిలిచిన నీరు, దెబ్బతిన్న రహదారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా సీజనల్ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో రోజురోజుకూ ఎక్కువవుతోంది.
రాష్ట్రంలో మరో మూడు రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మున్ముందు పరిస్థితులు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచి.. అపరిశుభ్ర వాతావరణం, దోమల తీవ్రత ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..? అటు స్థానిక సంస్థలు, ప్రభుత్వం చేయాల్సిందేంటి..? పౌరులుగా మన బాధ్యతలేంటి..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..