Prathidwani: మీరు వాడే ఔషధాల్లో ఏది అసలు..? ఏది నకిలీ..?
Prathidwani: కల్తీ కాటు బారిన పడితే ఆరోగ్యానికి పెనుముప్పు. మరి ఆ ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలే నకిలీ, నాసిరకం బాపతు ఆయితే? ఇది గాలివాటు విమర్శ కాదు.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్న చేదు నిజం. దేశంలో నాసిరకం, నకిలీ ఔషధాలు, వాటి ముఠాలు ఇలా విచ్చలవిడిగా చలామణి అవుతుండానికి కారణమేంటి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి పెడ పోకడలను అడ్డుకోవాల్సిన ఔషధ నియంత్రణ వ్యవస్థ ఏం చేస్తోంది? అసలు ఏది నకిలీ? ఏది కాదు అని గుర్తించడం ఎలా? ప్రాణాల్ని కాపాడే ఔషధాల విషయంలో ఎలాంటి దిద్దుబాటు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.