Prathidwani : ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో అసలేం జరుగుతోంది? - ఈరోజు ప్రతిధ్వని
Prathidwani Debet On Telangana Govt Places Regularisation : రాష్ట్రంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు.. జీవో నెంబర్-58,59. అందులో జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి, జీవో 59 ప్రకారం మధ్య తరగతి ఆపై తరగతికి చెందిన ప్రజలు నిర్మించుకున్న ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. జీవో 59 పరిధిలోని దరఖాస్తులు వేగంగా పరిష్కరిస్తున్నారని.. జీవో 59లోని దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ వేగవంతం చేయాలని ఏప్రిల్ లోనే సూచించింది మంత్రివర్గ సబ్‌కమిటీ. వారం, పదిరోజుల్లో ఆ పని పూర్తి చేయాలన్నారు. కానీ జాప్యం ఎందుకు జరుగుతోంది? మరి ఆ దరఖాస్తుల పరిష్కారం, సర్వేలు, హక్కుల కల్పన ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ విషయంలో ఏం జరుగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.