Prathidwani Debate on TSPSC Credibility : ప్రశ్నార్థకంగా కమిషన్ విశ్వసనీయత.. పరీక్షలు సజావుగా సాగేదెలా..? - TSPSC
Published : Sep 27, 2023, 10:04 PM IST
Prathidwani Debate on TSPSC Credibility : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను(TSPSC) చుట్టుముట్టిన వివాదాలు, గ్రూప్స్ పరీక్షలపై నెలకొన్న గందరగోళాలు.. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. నెలల తరబడి కొనసాగుతున్న ఈ ప్రకంపనల్లో.. ప్రస్తుతం మరో మలుపు చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ ఉదంతంతో గతంలో రద్దైన అనంతరం.. నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా నిబంధనలు సరిగా పాటించని కారణంగా రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది.
TSPSC Aspirants Confusion on Groups Exams : ఈ పరిణామాల్లో అధికారుల తప్పొప్పులు ఎలా ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఏళ్ల తరబడి నిద్రాహారాలు మాని సన్నద్ధం అవుతున్న.. అభ్యర్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇప్పుడేం చేయాలి? వారిలో భరోసాకు ప్రభుత్వం ఏం చేస్తే మేలు? వరస ఎదురుదెబ్బలు, విద్యార్థుల్లో నెలకొన్న నిరాశ, నిస్ఫృహల నేపథ్యంలో ఇప్పుడు కమీషన్ ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? అభ్యర్థుల ప్రయోజనాల రీత్యా ఏం చేస్తే మేలు? ఇకనైనా పరీక్షల నిర్వహణలో తీసుకు రావాల్సిన మార్పులేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.