Prathidwani : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. సామాజిక సమీక'రణం'లో గెలుపెవరిది..? - తెలంగాణ కుల రాజకీయాలు
Published : Oct 28, 2023, 9:19 PM IST
Prathidwani Debate on Telangana Social Equations :ఎన్నికల్లో బలమైన ముద్ర వేయగలిగిన ఒక ప్రధానాంశం.. సామాజిక సమీకరణాలు. అందుకే ప్రస్తుతం పార్టీలన్నీ ఈ విషయంలో ఆచీతూచీ అడుగులేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. సాధారణంగా కూడా.. అధికారం చేజిక్కించుకోవడానికి నియోజకవర్గంలో ఏ వర్గానికి అధిక ఓటు శాతం ఉందో చూసి.. ఆ దిశగా పావులు కదుపుతుంటాయి పార్టీలు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కుల సమీకరణాలది అత్యంత కీలక పాత్ర.
తెలంగాణ కూడా అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కానీ గతం కంటే మిన్నగా, విస్తృతంగా ఈసారి కులాల లెక్కల ఆధారంగానే రాజకీయం నడుస్తోందన్న చర్చకు కారణం ఏమిటి? తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో, స్వరాష్ట్రంలో సాధించుకున్న ఈ పదేళ్లలో ఎప్పుడు చూసినా తెలంగాణవాదం కేంద్రంగానే రాజకీయం అంతా నడిచింది. అందుకు భిన్నంగా ఇప్పుడు సామాజిక సమీకరణాలు బలంగా తెరపైకి రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఈ ఎన్నికల్లో ఆ లెక్కలు ఎలా ఉండనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.