తెలంగాణ

telangana

Telangana Assembly Elections 2023

ETV Bharat / videos

Prathidwani : ఎన్నికల పోరు తరుణం.. పార్టీల సన్నద్ధత - t congress

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 10:48 PM IST

Prathidwani Debate on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లకు ఈసీ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వెళిపోతోంది. షెడ్యూల్ కూడా రేపో, మాపో అన్నట్లుగానే ఉంది. తాజాగా రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సభలు, సమావేశాలతో నిర్వహిస్తూ.. తమ ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూ ఓటర్ల నాడీ పట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా 

CEC on Telangana Elections 2023 : బీఆర్​ఎస్​.. ఒక అడుగు ముందుకేసి దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. మంత్రి హరీశ్​రావు, కేటీఆర్​ అన్ని తామైనట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్​ ఇక అభ్యర్థులను ప్రకటించలేదు. అయినప్పటికీ తుక్కుగూడ నిర్వహించిన సభలో ప్రకటించిన హామీలతో.. కాంగ్రెస్​ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. బీజేపీ కూడా జాతీయస్థాయి నాయకులు సభలు నిర్వహిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలో ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహన్ని అడ్డుకోవడం ఎన్నికల కమిషన్​కు కత్తిమీదే సాము వంటిదేనని చెప్పాలి. మరి రాష్ట్రంలో ఎన్నికల వేళ పార్టీల సన్నద్ధత.. పోటీ ఎలా ఉండబోతోంది. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ఈసీ సఫలీకృతం కానుందా? ఇదే నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details