PRATHIDWANI ప్రజలు కోరిన సమాచారమివ్వడంలో పాలకుల అభ్యంతరం ఏంటి - ప్రతిధ్వని
ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు, ప్రభుత్వపాలన పై ప్రజలు సంధించే పాశుపతాస్త్రం సమాచార హక్కుచట్టం. కానీ ఇప్పుడు దాని అమలుకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజలు కోరే సమాచారాన్ని ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అధికారులు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో సహ దరఖాస్తులు చేయడానికి వీల్లేదంటూ 18మందిపై నిషేధం విధించడం, స.హ. చట్టంపై ప్రశ్నించినవారు ఇప్పటివరకు దేశజనాభాలో 3% మించకపోవడం ఈ చట్టంపై ప్రభుత్వాల వైఖరిని తేటతెల్లం చేస్తోంది. అసలు ప్రజలు కోరిన సమాచారం ఇవ్వడంలో పాలకులకు ఉన్న అభ్యంతరం ఏంటి? ప్రశ్నించిన వాళ్ళపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? క్షేత్రస్థాయిలో స.హ. చట్టం సమర్ధంగా అమలవ్వాలంటే ప్రభుత్వం, పౌరులు ఏంచేయాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST