Prathidwani : ఎన్నికల ప్రచారహోరులో ప్రజాసమస్యలెక్కడ? - తెలంగాణ ఎన్నికల్లో ప్రజా సమస్యలు
Published : Oct 30, 2023, 10:03 PM IST
Prathidwani Debate on Public Issues Drought in Election Campaign : ఎన్నికల ప్రచారం హోరెత్తించే క్రమంలో అసలైన సమస్యలు పక్కకి పోతున్నాయా? ప్రస్తుతం రాష్ట్రంలో పతాకస్థాయికి చేరిన ప్రచార పర్వంలో పరస్పర విమర్శలు, దాడులు తప్ప.. ఆయా నియోజకవర్గాల్లో ఉండే స్థానిక సమస్యల ఊసే లేకుండా పోతోందా? ఎన్నికల ప్రచారంలో ప్రముఖుల పోటీ స్థానాలపై సవాళ్ల పర్వం కూడా అందరి ఆకర్షిస్తోంది. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేస్తే ఏంటి? దీనివల్ల అభివృద్ధిలో వచ్చే మార్పులు ఏమిటి?
అభ్యర్థి విజయానికైనా.., వారి శక్తి సామర్థ్యాలు అంచనా వేయడానికైనా.. సమస్య పరిష్కారమే ప్రాతిపదికగా చూడాల్సిన అవసరముంటుంది. కానీ వాస్తవిక పరిస్థితులు మాత్రం దానికి దూరంగా సాగిపోతున్నాయన్నదే ఇప్పుడు చర్చ కారణం అవుతోంది. పార్టీల హామీలు, మ్యానిఫెస్టోలపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. 119 స్థానాల్ని తీసుకుంటే 119 రకాల పరిస్థితులుంటాయి. అలాంటిది అందరికీ ఒకటే హామీలు, ఒకటే మ్యానిఫెస్టో సరైనదేనా? ఈ నేపథ్యంలో స్థానిక సమస్యల పట్ల అభ్యర్థులు, పార్టీలు ఎలా స్పందించాల్సిన అవసరముంది? వాటి ఆవశ్యకత ఏమిటనే అంశంపై.. నేటి ప్రతిధ్వని.