Prathidwani : ఏకదంతుడి పుట్టినరోజుని.. పర్యావరణహితంగా జరుపుకోవడం ఎలా..?
Published : Sep 8, 2023, 8:52 PM IST
Prathidwani Debate on POP Ganesh Idols :సాధారణంగా పండుగ వస్తుందంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. చిన్నాపెద్దా అందరిలో కొత్త సందడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రాబోతున్న వినాయక చవితి విషయంలో మాత్రం.. పర్యావరణం అనే కోణంలో భిన్నమైన స్పందనలు చూడాల్సి వస్తోంది. వినాయకచవితికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రంగురంగుల గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. చెరువులు, కుంటలలో నిమజ్జనం చేస్తారు. దానివల్ల కాలుష్యం ఏర్పడుతోంది.
Eco Friendly Festival Celebrations : మట్టి జీవాన్ని ఇస్తుంది. అలాంటి మట్టి ముద్దలతో తీర్చిదిద్దాల్సిన వినాయక విగ్రహాలను రసాయనాలు, పీవోపీలతో చేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన ప్రతిమలతో ఈ భూమికి ఎలాంటి ఆపదలు వాటిల్లుతున్నాయి? దీపావళి విషయంలో తీసుకున్నా దేశంలో చాలా చోట్ల శబ్ద, జల కాలుష్యం ఆరోజు అధికంగా ఉంటోంది. న్యాయస్థానాలు కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాయి. సమాజానికి, తోటివారికి ఇబ్బంది కలిగేలా పండుగలు చేసుకోమని ఏ శాస్త్రమూ చెప్పదు. వివిధ పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవటం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని