తెలంగాణ

telangana

Prathidwani

ETV Bharat / videos

Prathidwani : ప్రారంభానికి సిద్ధమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు.. నీటి గోస తీర్చేలా స్వరాష్ట్రంలో వడివడిగా ప్రభుత్వం అడుగులు

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 11:01 PM IST

Updated : Sep 7, 2023, 11:17 PM IST

Prathidwani Debate on Palamuru Ragareddy Lift Irrigation Project : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మరో భారీ ఎత్తిపోతల పథకం పాలమూరు-రంగారెడ్డిని (Palamuru Ragareddy Lift Irrigation Project ) సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న ప్రారంభించనున్నారు. శ్రీశైలం వెనక భాగం నుంచి నీటిని ఎత్తిపోసే మొదటిపంపు హౌస్‌ నార్లాపూర్‌ ఇన్‌టేక్‌వెల్‌ వద్ద స్విచ్‌ ఆన్‌ చేసి వెట్‌ రన్‌ ప్రారంభిస్తారు. ఇప్పటికే మొదటి పంపుహౌస్‌లోని మోటార్లకు డ్రై రన్‌ పూర్తి చేయగా.. 16న వెట్‌ రన్‌ ద్వారా నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న కేసీఆర్‌.. అదే రోజు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాల సర్పంచులను, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో తాగునీరు, సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలంపాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇందులో ఒక్కొక్కటీ 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులు ఏర్పాటు చేశారు. నీటి గోస తీర్చేలా స్వరాష్ట్రంలో వడివడిగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Sep 7, 2023, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details