సంక్రాంతి విశిష్టత ఏమిటి - దీనిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు? - bhogi
Published : Jan 13, 2024, 9:38 PM IST
|Updated : Jan 14, 2024, 9:46 AM IST
Prathidwani Debate on Makar Sankranti: సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేసే సందర్భాన్ని సంక్రాంతిగా మూడు రోజుల పాటు జరుపుకుంటాము. దీనిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు? ఈ పండుగకు జ్యోతిష్య శాస్త్ర పరంగా ఉన్న విశిష్టత ఏంటి? సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకు అంటారు? ఈ కాలంలో ప్రజలు ఆచరించాల్సిన విధులేంటి?
అసలు నవగ్రహాలలో సూర్యభగవనుడిని గ్రహాధిపతి అని ఎందుకు అంటారు? ఆయన ప్రభావం మనుష్యులపై ఎలా ఉంటుంది? సంక్రాంతి అంటే ముగ్గులు, ప్రభలు గుర్తుకు వస్తాయి. వీటి వెనుక ఉన్న ఆచారాలు ఏంటి? సంక్రాంతి 3 రోజులూ ప్రజలు ఏఏ విధులను ఆచరించాలి? వేటిని చేయకూడదు? కనుమ రోజు పితృదేవతలను ఎందుకు ఆరాధించాలి? దానివల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది? ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు అనుకూల స్థానంలో ఉన్నాడా లేక ప్రతికూలంగా ఉన్నాడా అని ఎలా తెలుస్తుంది? ఆయన ఎటువంటి ఫలితాలను ఇస్తారు? సూర్యుడి అనుకూలత కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని.