Prathidwani Debate on ISRO Researches: విశ్వ రహస్యాల శోధనలో ఇస్రో.. ప్రపంచానికే పెద్దన్న పాత్రగా భారత్
Published : Sep 30, 2023, 10:30 PM IST
Prathidwani Debate on ISRO Researches:చంద్రయాన్-3 అద్భుత విజయంతో ఎంతో ఉత్సాహంలో ఉన్న.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తర్వాత లక్ష్యం ఏమిటి? ఎలాంటి అనుమానం లేదు.. తమ గురి శుక్ర గ్రహంపైకే అని ప్రకటించారు ఇస్రో అధిపతి సోమనాథ్. ఈ సంకల్పం ప్రత్యేకత ఏమిటి? ఆ మిషన్ ఎప్పటిలోపు ఉండొచ్చు? మరి ఈ అనంత విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో గ్రహాంతర ప్రయోగాల పాత్ర ఏమిటి? ఆ ప్రయోగ ఫలితాలు ఒక సాధారణ పౌరుడికి కూడా ఎలాంటి ప్రయోజనం కలిగిస్తాయి?
New innovations of ISRO:అసలు సైన్స్ గుర్తించిన గ్రహాలు ఎన్ని? వాటి అన్వేషణలో ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పటి వరకు చేపట్టిన చంద్రయాన్, మంగళ్‌యాన్ వల్ల అందిన సమాచారం, కలిగిన ప్రయోజనాలు ఏమిటి? అలానే ఆదిత్యా చెప్పబోయే సంగతులు మనకు ఎందుకు కీలకం? ఇస్రో తన భవిష్యత్‌లో మిషన్‌లలో గ్రహాంతర అన్వేషణలకు సంబంధించి నిర్ధేశించుకున్న భారీ లక్ష్యాలు ఏమిటి? వాటన్నింటి ద్వారా మానవాళికి ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.