PRATHIDWANI బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యమేనా - బీఆర్ఎస్ కు దేశ రాజకీయం సాధ్యమేనా ప్రత్యామ్నాయం
రాజకీయాలపై కాస్త అవగాహన, ఆసక్తి ఉన్న ఏ ఇద్దరు ఓ చోట చేరినా.. బీజేపీకి ఆల్టర్నేటివ్ ఏమిటన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. అడపాదడపా ప్రాంతీయ పార్టీలు, అక్కడక్కడా కాంగ్రెస్ మినహా... దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురు నిలబడే పార్టీలే కనిపించడం లేదు. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కమలదళాన్ని ఆపతరమా అనే పరిస్థితి నెలకొంది. భాజపాను ఢీకొట్టేందుకు శతాధిక చరిత్ర కలిగిన కాంగ్రెస్సే తలకిందులవుతన్న వేళ ఆప్, తృణమూల్, జేడీయూ సహా కొత్తగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఎంతమేర ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏకపార్టీ స్వామ్యం దిశగా దేశం మళ్లుతోందనే పరిస్థితుల నుంచి ప్రత్యామ్నాయం కాగల సామర్థ్యం ఉన్నదెవరికి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST