హైదరాబాద్ అభివృద్ధి కోసం కొత్త సర్కార్ న్యూ ప్లాన్ - అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రణాళికలు
Published : Dec 19, 2023, 10:39 PM IST
Prathidwani Debate on Hyderabad Development Plan : ఇప్పటికే రాజధాని నగర అభివృద్ధి, విస్తరణపై కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన దగ్గర నుంచి వివిధ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇవ్వడంతో పాటు సమగ్రమైన స్పష్టమైన ప్రణాళికలతో రావాలని అధికారులకు కూడా ఆదేశించారు. అలాగే నగరాన్ని ఒకే వైపు కాకుండా అన్ని వైపులా అభివృద్ధి చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
Congress Plans on Development : అయితే రేపటి మహానగరం ఏ విధంగా ఉండాలనే అంశంపై ప్రభుత్వ ఆలోచనలను కొన్నింటిని ప్రజల ముందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉంచారు. ఈ విషయాలపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది. అసలు ఓఆర్ఆర్- ఆర్ఆర్ఆర్ మధ్య గ్రోత్ పొటెన్షియాలటీ ఏమిటీ? ఈ విషయాలపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ఇప్పుడున్న విజన్ ప్రకారం పర్యావరణానికి అనుకూలంగా మహానగరం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం దగ్గర దీర్ఘ కాలిక ప్రణాళిక ఉన్నాయా వంటి అంశాలపై నేటి ప్రతిధ్వని.