PRATHIDWANI రాష్ట్రంలో మున్సిపాల్టీల మనుగడ ఎలా ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇచ్చేదెప్పుడు - ETV Bharat PRATHIDWANI Latest News
PRATHIDWANI మున్సిపాలిటీల మనుగడ ఎలా. ఇప్పుడు ఒకరకంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వినిపిస్తోన్న ప్రశ్న ఇదే. పాతవి, ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినవి కలిపి రాష్ట్రంలో మొత్తం 128 పైగా పట్టణ స్థానిక సంస్థలు కొలువుదీరాయి. కానీ వాటి ఆర్థిక పరిస్థితి ఏమిటి. వాటి ఏర్పాటుతో ఆశించిన మేరకు జరుగుతున్న అభివృద్ధి ఎంత. ఆయా పరిధుల్లో ప్రజలు అందరూ సాధారణంగా ఆశించే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణపైనా కూడా ఎందుకు విమర్శలు మూట గట్టుకోవాల్సి వస్తోంది. కంకర తేలిన రోడ్లు, కూలుతున్న డ్రైనేజీలు, చిన్నవానకే మునుగుతున్న కాలనీలు సంధిస్తోన్న ప్రశ్నలూ ఇవే. వాటితో పాటు పట్టణ వ్యర్థాల నిర్వహణపై ఎన్జీటీ వేసిన భారీ జరిమానా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో చెప్పకనే చెప్పింది. మరి ఈ సమస్యలన్నింటికీ మూలం ఎక్కడ. దిద్దుబాటు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST