తెలంగాణ

telangana

Prathidwani

ETV Bharat / videos

Prathidwani: సంస్కృతిలోని జీవశక్తికి ప్రతీకలు మన పండుగలు.. మరి వాటి పరమార్థం ఏంటి అంటే..? - ప్రముఖ పండుగలు వాటి ప్రాముఖ్యత

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 9:33 PM IST

Prathidwani: పండుగలంటే సెలవు దినాలు కాదు. మన సంస్కృతిలోని జీవశక్తికి ప్రతీకలు ఈ పండుగలు. మన ఆధ్యాత్మిక జీవనంలో వాటిది విశిష్ట స్థానం. జనంలో సామాజిక చైతన్యాన్ని, ధార్మిక వాతావరణాన్ని, ఏకతాభావాన్ని పెంపొందించడానికి మంచి ఉపకరణాలు మన భారతీయ పండుగలు. ఒక జాతి సంస్కృతిని ఆ దేశ ప్రజలు ఆచరించే పండగల్లో దర్శించవచ్చు. మనిషి అలసటకు, ఆందోళనలకు కారణమవుతున్న వేగవంతమైన యాంత్రిక జీవనంలో పండగలు సేదతీర్చే మజిలీలు. మానసికంగా, ఆత్మపరంగా, పరిణతి చెందినప్పుడు వచ్చే జ్ఞానం, ధర్మ ప్రవర్తనతో పరమార్థం కోసం మానవుడు సాగించే అన్వేషణే  ఆధ్యాత్మికత. ప్రతి తిథి, వారం, మాసం భారతీయులకు విశిష్టం, దైవారాధనకు శుభప్రదం. లోక క్షేమం కోసం నక్షత్రగమనం, రుతుధర్మం ఆధారంగా పండుగలు ఏర్పాటు చేశారు. ప్రకృతి పరిణామాల్లోని దివ్యశక్తిని నింపుకొనేలా సంకల్పించినవే పర్వదినాలు. ఆరోగ్యం, ఆహ్లాదంగా జీవించేందుకు పూర్వీకులు అందించినవి ఆచారాలు. అయితే వాటి పరమార్థాన్ని గ్రహించి, వాటి సందేశాన్ని అందిపుచ్చుకున్నప్పుడే మన జీవనానికి సార్థకత. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details