Prathidwani : పార్టీల్లో సర్వేల జోరు.. ఎన్నికలపై వాటి ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు..? - Effect of exit polls in Telangana
Published : Oct 14, 2023, 9:34 PM IST
Prathidwani Debate on Exit Polls Credibility in Telangana : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. స్వరాష్ట్రంలో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ప్రతిష్ఠాత్మకంగా మారిన.. మూడో దఫా అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్ని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ.. తమ అభ్యర్థుల ఎంపికకు, జనాల నాడీని తెలుసుకోవడానికి సర్వేలపై ఆధారపడుతున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ల అవశ్యకతపై రాజకీయపార్టీలతో పాటు సామాన్యవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అనేక సర్వేలు, సమీకరణాలు.. గతంలో ఎన్నడూ లేనంతగా వీటి ప్రభావం, ప్రమేయం కనిపిస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల మధ్య ఈ సర్వేల లొల్లి ఎక్కువగానే కనిపిస్తోంది. సామాన్యులు ఈ సర్వేలను ఎంత వరకు నమ్మొచ్చు.. మరి ఈ సర్వేల్లో విశ్వసనీయత ఎంత? కోట్లల్లో ఉండే ఓటర్లకు సంబంధించి వేలల్లో తీసుకుని సర్వే శాంపిళ్లను అసలు నమ్మేది ఎలా? ప్రజల అంతిమ నిర్ణయంపై ఈ ప్రభావాలు ఏ మేరకు ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.