తెలంగాణ

telangana

Prathidhwani

ETV Bharat / videos

PRATHIDWANI: ఎన్నికల సంఘం స్వేచ్ఛ, స్వతంత్రతలో ఎందుకీ పరిస్థితి..! - జస్టిస్​ హృషికేష్​ రాయ్

By

Published : Mar 2, 2023, 10:26 PM IST

Prathidhwani : ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే.. కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఇంతకాలం ఈసీ, సీఈసీ నియామకానికి అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీం తెలిపింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు వెల్లడించింది. 

ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకే ఈసీలను రాష్ట్రపతి నియమించాలని ఆదేశించింది.ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్​, ఎన్నికల కమిషనర్​లను నియమించే కమిటీలో.. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రపతి వారిని నియమించాలని సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా ఎన్నికల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని సుప్రీం తెలిపింది.

న్యాయమూర్తి జస్టిస్ కేఎమ్​ జోసెఫ్ నేతృత్వంలోని జస్టిస్​ అజయ్​ రస్తోగి, జస్టిస్​ అనిరుద్ధ బోస్​, జస్టిస్​ హృషికేష్​ రాయ్​, జస్టిస్​ సీటీ రవికుమార్​తో కూడిన ప్రత్యేక ధర్మాసనం.. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాసంకల్పంతో ముడిపడిన అంశమని పేర్కొంది. ఈ ధర్మాసనం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకత అవసరం లేదంటే.. అది దేశ వినాశనానికి దారి తీస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈసీ రాజ్యాంగ పరిధిలోని చట్టాలకు అనుగుణంగా ఉండాలని.. అన్యాయంగా వ్యవహరించకూడదని ధర్మాసనం పేర్కొంది. ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన ప్రత్యేక ధర్మాసనం వెల్లడించిన ఏకగ్రీవ తీర్పు.. ఈ అంశంపై పార్లమెంటు చట్టం చేసే వరకు అమల్లో ఉంటుందని తేల్చిచెప్పింది.

దేశ చరిత్రలోనే మరో చారిత్రక తీర్పును వెలువరించింది... సర్వోన్నత న్యాయస్థానం. ఎలక్షన్ కమిషనర్ల నియామకాల ప్రస్తుత విధానాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో ప్రధాని, ప్రతిపక్షనాయకుడు, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్తగా చట్టం వచ్చే వరకు ఈ కమిటీనే సీఈసీ, ఈసీల నియామకాలు చేపట్టాలంది సుప్రీంకోర్టు. భారత దేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఇరుసులా ఉండాల్సిన ఎన్నికల సంఘం స్వేచ్ఛ, స్వతంత్రల విషయంలో అసలు పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది? నిర్వచన సదన్‌ నడిపించే ఎన్నికల కమిషనర్ల ఎంపికలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో లోటుపాట్లేంటి? సంస్కరణలతో అంతా ఆశిస్తున్న మార్పులు ఎలా ఉంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.    

ABOUT THE AUTHOR

...view details