పార్టీ ఫిరాయింపుల చట్టం మన దేశంలో పని చేస్తోందా అందులో లోపాలేంటి - Moinabad farmhouse incident
పార్టీ ఫిరాయింపులు, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై ఊహించని పిడుగులు. ఒక పార్టీ గుర్తు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి మారడం అనైతికం. పార్టీ మారే నేతలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు పడాలి. కానీ, దశాబ్దాలుగా దేశంలో పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధులపై నమోదవుతున్న కేసులు వీగిపోతూనే ఉన్నాయి. చట్టంలో లోపాలను అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఫిరాయింపుల గోడలు దూకుతూనే ఉన్నారు. ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ ఇలా దేశంలో ఏ దిక్కుకు వెళ్లినా నాయకులకు ప్రలోబాలు, పార్టీ ఫిరాయింపులు, అర్దాంతరంగా కూలిపోయిన ప్రభుత్వాల ఆగచాట్లు దర్శనమిస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెరపైకొచ్చిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం, వాటిలో లోపాలు, పరిష్కారాలపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST