మళ్లీ కొవిడ్ కలకలం- ప్రజలంతా జరభద్రం - ప్రతిధ్వని
Published : Dec 27, 2023, 9:04 PM IST
Prathidwani Debate on Covid in Telangana : రాష్ట్రంలో కరోనా మళ్లీ కలవరం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా రాజధాని జంట నగరాల్లో కొవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గ్రేటర్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ హైదరాబాద్‌లో ఉంటుండడం ఆందోళన కల్గిస్తోంది.
Corona in Telangana :గత కాలం నాటి కొవిడ్ పరిస్థితుల పీడ కలలన్నీ కళ్ల ముందు కదలాడుతూ మళ్లీ భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ అలర్ట్ ప్రకటించింది. కరోనా పరీక్షలకు కిట్లు, రోగులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి అన్ని ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేశామని, కొత్త వేరియెంట్‌పై కంగారు అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడో చిన్న అసౌకర్యం అందరిలో మెదులుతోంది. మరి ఈ విషయంలో మన ముందున్న ప్రశ్నలకు సమాధానాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.