Prathidwani on investments in Andhrapradesh : బై బై జగన్... బై బై ఏపీ - jagan
Prathidwani on investments in Andhrapradesh : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ అభివృద్ధిలో పోటీ పడ్డాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం తెలంగాణ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. అమర్‌రాజా నుంచి లూలూ వరకు బై బై జగన్... బై బై ఆంధ్రప్రదేశ్ అంటూ తెలంగాణ గడపతొక్కాయి. ఏపీలో రూ. 2,200 కోట్ల పెట్టుబడులు విరమించుకున్న లూలూ.. అదే తెలంగాణలో రూ. 3500కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టమని తెగేసి చెప్పింది. ఇటీవలే తెలంగాణలో అమర్‌రాజా సంస్థ ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీకి.. భారీ పెట్టుబడులతో ప్రాజెక్టు ప్రకటించింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోతే యవతకు ఉద్యోగాలు, ఉపాధికి భరోసా ఎలా కలిగిస్తారు. జగన్ సర్కార్ పెట్టుబడిదారులకు ఏం సంకేతం ఇస్తున్నట్లు అనుకోవాలి. పెట్టుబడుల వాతావరణంలో 4ఏళ్లలో ఎందుకింత తేడా వచ్చింది. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుదిటిరాత తలకిందులు కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? పారిశ్రామికవేత్తలు ఏపీ అంటే ఎందుకు జడుస్తున్నారు? ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో ఏపీబ్రాండ్ ఇమేజ్ ఏం అవుతుంది? ఇదీ నేటి ప్రతిధ్వని.