తెలంగాణ

telangana

Prathidwani Debate on Climate Changes in India

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 10:24 PM IST

ETV Bharat / videos

Prathidwani : దేశంలో వాతావరణ మార్పులు సాగు సవాళ్లు.. ఎలాంటి మార్పులు తీసుకు వస్తే గండం గట్టెక్కే అవకాశం?

Prathidwani Debate on Climate Changes in India :దేశంలో రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న వాతావరణ మార్పులు.. సాగురంగం, ఆహారభద్రతకే పెను సవాళ్లు విసురుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రభావం మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పులు ఆకలికేకలకు దారీ తీయవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్​లో రాబోతున్న ఉపద్రవాలకు ప్రస్తుత వర్షాకాలం సీజన్నే ఉదాహరణగా చూపిస్తున్నారు నిపుణులు.

మన దేశ రైతాంగం రుతుపవనాలపై ఆధారపడి ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడులతో పాటు.. పోషకాల విలువలు కూడా తరిగిపోవచ్చని నిపుణలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమల్లో 40-47% వరకు దిగుబడి తగ్గనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి రాబోతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఎలా? ఆ దిశగా ప్రభుత్వాల వ్యవసాయ విధానాలు, పంటల ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు అవసరం? రైతన్నల్లో ఏ మేరకు అవగాహన కలిగించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details