Prathidwani: చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత భారత్ స్థానం ఏంటి..?
Published : Aug 23, 2023, 10:23 PM IST
Prathidwani: చంద్రుడిపై ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలను ఒకసారి అవలోకనం చేసుకుంటే.. చంద్రయాన్ -3 తర్వాత మనం ఏ స్థానంలో ఉంటాం? అందరిలోని సాధారణ ప్రశ్న... సుదూర విశ్వంలోని చంద్రుడిపై ఇంత అన్వేషణ ఎందుకు? చంద్రుడి స్థితిగతులు, చరిత్ర, ఆవిర్భావ క్రమం తెలుసుకోవడం ద్వారా ఏమిటి ప్రయోజనం? ఇప్పటి వరకు ప్రపంచంలో మరే దేశమూ చంద్రుడి దక్షిణధ్రువాన్ని ఎందుకు చేరుకోలేక పోయింది? ఇటీవలి రష్యా ప్రయత్నం కూడా విఫలమైంది? అక్కడి వెళ్లడం ఎందుకంత కష్టం? ఇస్రో అత్యంత సంక్లిష్టమైన మిషన్‌ల్ని ఇంత అవలీలగా ఎలా పూర్తి చేస్తోంది. అదీ ప్రపంచంలో ఎవ్వరూ ఊహించనంత తక్కువ ఖర్చుతో. ఈ విషయంలో వారి విజయ రహస్యమేంటి? నాసా, ఇస్రో వచ్చే ఏడాది ఉమ్మడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం - ISSకు యాత్ర చేపట్టనున్నాయి. వీటితో పాటుగా భవిష్యత్‌లో ఇస్రో చేపట్టబోతున్న ఇలాంటి మరిన్ని ప్రతిష్టాత్మక మిషన్‌లు.. వాటి ప్రత్యేకతలు ఏమిటి? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.