Prathidwani : మరోసారి చర్చనీయాంశంగా యాచక ముఠాలు.. పూర్తిస్థాయిలో ఈ మాఫియా ఆటకట్టించాలంటే ఏం చేయాలి? - hyderabad latest news
Published : Aug 22, 2023, 9:29 PM IST
Prathidwani Debate on Begging Mafia in Hyderabad : హైదరాబాద్‌లో ఇటీవల బెగ్గింగ్ మాఫియా చర్చనీయాంశంగా మారింది. భాగ్యనగరంలో యాచక ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి చిన్నపిల్లలు, వృద్ధులు, హిజ్రాలకు డబ్బు ఆశ చూపి యాచకులుగా మారుస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్లు, రోడ్లపై వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఛారిటీలకు ఆర్ధిక సహాయం చేయండి.. అంటూ మాయామాటలు చెబుతూ డొనేషన్ బాక్స్‌లతో తిరుగుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి సంపాదన ఎంతలా ఉందంటే.. హైదరాబాద్‌లో కోట్ల విలువైన ప్లాట్లు కొనుగోలు చేయడం గమనార్హం. 2017 నుంచి నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీ దిశగా మార్చేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా సఫలీకృతం కాలేకపోయింది. అసలు ఇక్కడ యాచక మాఫియా ఎందుకు పెరుగుతోంది. అసలు వారంతా ముఠాల వలలో ఎలా చిక్కుకుంటున్నారు. పూర్తిస్థాయిలో ఈ మాఫియా ఆటకట్టించాలంటే ఏం చేయాలి? అభాగ్యులు, యాచకుల పునరావాసానికి ఏం చేయాలి ఇదే నేటి ప్రతిధ్వని