తెలంగాణ

telangana

Prathidwani

ETV Bharat / videos

దేశవ్యాప్తంగా రామనామ స్మరణ - ఆయన చూపిన విలువలు, చెప్పిన ధర్మం గురించి తెలుసుకుందామా?

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 9:07 PM IST

Prathidwani : ప్రస్తుతం దేశమంతటా రామ నామ స్మరణ విశేషంగా జరుగుతోంది. అయోధ్యలో రేపటి నుంచి (జనవరి 16) రామ మందిర ప్రతిష్ఠాపన అమృత మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న లక్ష్మణ సమేత సీతారాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. మహత్తరమైన ఈ వేడుకను వీక్షించేందుకు ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు అందాయి.

ఇక మంగళవారం నుంచి జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన అమృత మహోత్సవాల్లో భాగంగా రేపు శ్రీ రాముని విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్య నగరంలోకి తీసుకుని వస్తారు. దేశంలోని అన్ని ఆలయాల్లో ఇప్పటి నుంచే అఖండ దీపారాధనలు, సుందరకాండ పారాయణలు, రామాయణ ప్రవచనాలు సాగుతున్నాయి. అసలు త్రేతాయుగం నాటి రాముల వారిని నేటికీ ఎందుకు స్మరించుకుంటున్నాము? రాముడు ఆచరించి చూపిన విలువలు ఏంటి? రామ రాజ్యం అని ఎందుకు అంటారు? రాముడు చెప్పిన రాజధర్మం ఏంటి? శ్రీ రామచంద్ర ప్రభువు నుంచి నేర్చుకోవాల్సిన సుగుణాలు ఏంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details