Prathidwani ఏ రంగాల వారికి ముందుగా 5జీ సేవలు
Prathidwani దేశంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రంగంలో సేవలు అందించేందుకు పోటీ పడుతున్న సంస్థలు ఇప్పటికే లైసెన్సులు పొందాయి. స్పెక్ట్రంలో వాటాలనూ దక్కించుకున్నాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 3జీ, 4జీ పరిజ్ఞానం టెలీకాం, టెలీ మెడిసిన్, ఆన్‌లైన్ విద్య వంటి కొన్ని అంశాలకే పరిమితమైంది. దీనికి భిన్నంగా 5జీ టెక్నాలజీ సెల్‌ఫోన్ నుంచి శాటిలైట్ వరకు ఆట వస్తువుల నుచి రోబోటిక్ సర్జరీల వరకు సమూల మార్పులకు బాటలు వేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 5 జీ పరిజ్ఞానంతో చోటు చేసుకునే పరిణామాలు ఏంటి. ఏ రంగాల వినియోగదారులకు ముందుగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయా అనే అంశాలపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST