తెలంగాణ

telangana

cbi enquiry

ETV Bharat / videos

PRATHIDWANI: సహకరిస్తానని చెప్తూనే.. విచారణకు ఎందుకు దూరం..? - అవినాష్​ రెడ్డిని అరెస్ట్​ చేస్తారని ప్రచారం

By

Published : May 22, 2023, 10:20 PM IST

PRATHIDWANI: కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వేదికగా రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సామాన్యులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి.. కేసు దర్యాప్తులో సీబీఐకి అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్తూనే విచారణకు ఎందుకు  దూరంగా ఉంటున్నారు..? ఏ తప్పూ చేయకపోతే విచారణకు సహకరించవచ్చు కదా? అని ప్రతి ఒక్కరూ సందేహిస్తున్నారు. వివేకా హత్యకు కుట్ర, ఆధారాలు చెరిపేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తన అభియోగపత్రంలో పేర్కొన్న సీబీఐ.. అరెస్టు చేసి కస్టడీలో విచారించాల్సి ఉందని గతంలోనే కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కారణంగానే ఆది నుంచీ సీబీఐతో దాగుడుమూతలు ఆడుతున్న అవినాష్ రెడ్డి... అరెస్టు చేస్తారనే అనుమానం వస్తే చాలు.. ఏదో సాకుతో తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నా... ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎందుకు దర్యాప్తు సంస్థలకు భయపడట్లేదని సామాన్యుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డిలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details