జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు - ఇక చోటు చేసుకోబోయే మార్పులు ఏంటి?
Published : Dec 11, 2023, 9:17 PM IST
Prathidwani: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హక్కుల అంశంలో మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ సమానమే అని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సమర్థించింది. అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. మరి జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? దాని నేపథ్యం ఏంటి?
జమ్మూకశ్మీర్‌లో వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తద్వారా ఆ ప్రాంతంలో భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? దశాబ్దాలుగా సుందర కాశ్మీర్ అంటే హింస, అభద్రత గుర్తుకు వచ్చేవి. దానిని రూపుమాపటానికి కేంద్రం ఇకపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? గతంలో వాజ్‌పేయి, మన్మోహన్ వంటి రాజనీతి కోవిదులు ప్రధానమంత్రులుగా పనిచేశారు. వారి హయాంలో ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి అడుగులు పడ్డాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.