60 ఏళ్లలో సీబీఐ సాధించిన విజయాలు, సంచలనాలు? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని ప్రోగ్రామ్
PRATHIDWANI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ 60 వసంతాలు పూర్తి చేసుకుంది. డైమాండ్ జూబ్లీ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సీబీఐపై విమర్శలను కొట్టిపారేశారు. అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టడంలో తగ్గేదేలేదని తేల్చి చెప్పారు. ఇంకా సీబీఐని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. సీబీఐ న్యాయానికి బ్రాండ్ అంబాసీడర్ అని ప్రధాని కితాబు ఇచ్చారు. 60 వసంతాల సీబీఐ పనితీరు, సాధించిన సంచలనాలు, ఎదుర్కుంటున్న విమర్శలపై విశ్లేషణాత్మక చర్చను చేపట్టింది. అయితే, సీబీఐ నాడు నేడూ ఎప్పుడు విశ్వసనీయత విషయంలో పరీక్షలు ఎదుర్కుంటోంది. కారణాలేంటి ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ... ఇవి సీబీఐ ప్రారంభ నినాదాలు. వాటి విషయంలో ఈ రోజు సీబీఐ ఎక్కడ ఉంది. దేశంలోని అవినీతిపై పోరాటంలో సీబీఐ పాత్ర ఏమిటి? సీబీఐ చరిత్రలో ఇప్పటి వరకు ఛేదించిన చారిత్రక కేసులు ఏమిటి. అలాగే సీబీఐ నేరనిరూపణ చేయటంలో ఫెయిల్ అయిన ముఖ్య కేసులు ఏవైనా ఉన్నాయా అనే అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.