Prathidhwani: రైలు ప్రమాదాల నుంచి మనం ఏం గుణపాఠాలు నేర్చుకున్నాము?
ఒడిశాలో అతి భయంకరమైన రైలు ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు చూస్తుంటే వళ్లు జలదిరిస్తోంది. రైలు ప్రమాదాలకు మనకి కొత్తకాదు. కానీ గతంలో జరిగిన ప్రమాదాల నుంచి మనం ఏం గుణపాఠాలు నేర్చుకున్నాము? ఫ్లెక్సీ ఫేర్స్ అని, క్యాన్సిలేషన్ ఛార్జీలు అని, స్వచ్ఛభారత్ సెస్ అని, ఎడ్యుకేషన్ సెస్ అని, కృషీ సంచాయి సెస్ అని అనేక సెస్‌లు చెల్లిస్తున్న ప్యాసింజర్లు రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 లక్షల కోట్లకు పైగా ఆదాయం గడించిన రైల్వేలు ప్రయాణికుల భద్రతపై ఎంత ఖర్చు చేస్తున్నాయి? రైలు ప్రమాదాలను ఆపాలంటే ఏం చేయాలి? 128కి.మీ. వేగంతో ఢీ కొట్టిన కోరామండల్ ఎక్స్‌ప్రెస్ కోరామండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఎమర్జన్సీ బ్రేక్ అప్లై చేసి ఉంటారా..? ఒక వేళ అప్లై చేయకపోతే ప్రమాదం ఎలా ఉండేది..? మ్యానువల్‌గా జరిగే పొరపాటుకు సాంకేతికంగా అడ్డుపడే వ్యవస్థ లేదా...? భద్రతా విభాగాన్ని రైల్వే శాఖ ఎందుకు పటిష్ఠం చేయలేకపోతోంది? ఇలా అనేక అంశాలపై నేటి ప్రతిధ్వని.